అయస్కాంత పదార్ధాలు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
వస్తువులు అయస్కాంత క్షేత్రంలో పొందే ధర్మాలనుబట్టి, వాటిని పారా, డయా, ఫెరో అని మూడు రకాల అయస్కాంత వస్తువులుగా విభజింపవచ్చును.[1]
పారా అయస్కాంత వస్తువులు
[మార్చు]అయస్కాంత క్షేత్రంలో ప్రేరణవల్ల అయస్కాంత క్షేత్రదిశలో స్వల్పమైన అయస్కాంత తత్వాన్ని పొందుతాయి. ఇవి అయస్కాంత క్షేత్రంలో తక్కువ క్షేత్ర బలదిస నుంచి ఎక్కువ క్షేత్రబలదిశవైపుకు కదలటానికి ప్రయత్నిస్తాయి. అల్యూమినియం, ప్లాటినం, క్రోమియం, ఆక్సీజన్, మాంగనీస్, ఫెరిక్ క్లోరైడ్, క్యూప్రిక్ క్లోరైడ్ మొదలైనవి పారా అయస్కాంత వస్తువులు. పొడవైన పారా అయస్కాంత వస్తువును అయస్కాంత క్షేత్రంలో స్వేచ్ఛగా వేళాడతీస్తే అది అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా వేళాడుతుంది. వస్తువు ద్వారా ఎక్కువ బలరేఖలు పోతాయి. వీటి ససెప్టబిలిటీ చాలా తక్కువగా వుండి ధనాత్మకంగా వుంటుంది. పదార్థం ససెప్టబిలిటీ దాని పరమ ఉష్త్నోగ్రత T కి విలోమానుపాతంలో ఉండి క్యూరీనియమాన్ని పాటిస్తుంది. Xm T = స్థిరాంకము.
డయా అయస్కాంత వస్తువులు
[మార్చు]డయా అయస్కాంత వస్తువులు అయస్కాంత క్షేత్రంలో ప్రేరణవల్ల క్షేత్రానికి వ్యతిరేక దిశలో అతిశ్వల్పమైన అయస్కాంతతత్వాన్ని పొందుతాయి. ఇవి ఎక్కువ అయస్కాంత క్షేత్రాల నుంచి తక్కువ అయస్కాంత క్షేత్రాల దిశకు కదలటానికి ప్రయత్నిస్తాయి. బిస్ మత్, రాగి, పాదరసము, ఆంటీమొనీ, బంగారము, నీరు, సారాయి, గాలి, ఉదజని మొదలైనవి డయా అయస్కాంత పదార్ధాలు. వీటిని అయస్కాంత క్షేత్రంలో స్వేచ్ఛగా వేలాడదీస్తే అవి అయస్కాంత క్షేత్రానికి లంబ దిశలో తిరుగుతాయి. వస్తువు వెలుపల అయస్కాంత బలరేఖలు ఎక్కువగా వుంటాయి. వీటి పర్మీయ బిలిటీ ఒకటికన్నా తక్కువగా వుంటాయి. ససెప్టబిలిటీకి స్వల్పమైన ఋణ విలువ వుండి, అది క్షేత్ర బలం మీదగానిఉష్త్నోగ్రత మీదగాని ఆధారపడి ఉండదు.
ఫెర్రో అయస్కాంత వస్తువులు
[మార్చు]అయస్కాంతాల వలన అకర్షితాలయి, అయస్కాంతాలుగా రూపొందే వస్తువులను ఫెర్రో అయస్కాంత వస్తువులని అంటారు.ఇనుము, కోబాల్ట్, ఉక్కు, నికెల్ వీటి లోహమిశ్రమాలు (alloys) ఫెర్రో అయస్కాంత వస్తువుల ధర్మాలన్ని కలిగి ఉంటాయి. వీటి అయస్కాంత పర్మియబిలిటీ, ససెప్టబిలిటీ విలువలు చాలా ఎక్కువగా వుంటాయి. వీటి ప్రేరణ అయస్కాంతత్వం, అయస్కాంతీకరణ తీవ్రత క్షేత్రబలానికి అనులోమాను పాతంలో వుండవు. వీటి పర్మీయబిలిటీ ఉష్త్ణోగ్రతనుబట్టి మారే విధానాన్ని క్యూరీ ఉష్త్నోగ్రత సమీపిస్తున్నకొద్ది పర్మియబిలిటీ చాలా వేగంగా వ్రుద్దిచెంది, క్యూరీ ఉష్త్నోగ్రతవద్ద గరిష్ఠ విలువను పొంది, తరువాత ఆకస్మికంగా తగ్గిపోతుంది. ఇక్కడ వస్తువు ఫెరో అయస్కాంత ధర్మాలను పూర్తిగా పోగొట్టుకొని, పారా అయస్కాంత ధర్మాలను పొందుతుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ పారా, డయా, ఫెరో ఆయస్కాంత పదార్ధాలు, పేజీ 171, స్థిర విద్యుత్ శాస్త్రము - ద్రవ్య అయస్కాంత ధర్మాలు, తెలుగు అకాడెమీ