అష్టసిద్ధులు
అష్టసిద్ధులు అనగా ఎనిమిది రకాల సిధ్దులు. భారతీయ తత్వ శాస్త్రంలో "సిద్ధి" అన్నమాటకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. సాధకుడు యోగమార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు, ఒక స్థాయిలో అతను భౌతికమైన సూత్రాలను దాటిపోతాడని చెబుతోంది యోగం. అప్పుడు అతనికి సిద్ధించే శక్తులే ‘సిద్ధులు’. సాంఖ్యం, భాగవతం, బౌద్ధం ఈ సిద్ధులను వేర్వేరు రకాలుగా నిర్వచిస్తున్నప్పటికీ, ప్రచారంలో ఉన్నది మాత్రం అష్టసిద్ధులే.
శ్లోకం
[మార్చు]వాటిని శ్లోక రూపంలో చెప్పుకోవాలంటే
అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః
- అణిమ: శరీరమును అతి చిన్నదిగా చేయుట
- మహిమ: శరీరమును అతి పెద్దదిగా చేయుట
- గరిమ: శరీరము బరువు విపరీతముగా పెంచుట
- లఘిమ: శరీరమును అతి తేలికగా చేయుట
- ప్రాప్తి: కావలసిన వస్తువులు పొందుట
- ప్రాకామ్యం: కావలసిన భోగము అనుభవించుట
- ఈశత్వం : ఎవరిపైనైనా, దేనిపైనైనా అధికారము పొందుట
- వశీత్వం: అన్ని భూతములను లోబరచుకొనుట
పతంజలి యోగ సూత్రం
[మార్చు]పతంజలి యోగ సూత్రాల ప్రకారం ఈ సిద్ధులు కేవలం యోగం ద్వారానే కాకుండా, ఒకోసారి జన్మతః సిద్ధించవచ్చు. మంత్రబలంతోనూ సాధించవచ్చు. ఒక్కోసారి దివ్యౌషుధలని స్వీకరించడం ద్వారా కూడా వీటిని పొందవచ్చు. అయితే సాధకుడు ఈ సిద్ధుల భ్రమలో పడితే, మోక్షం అనే అసలు లక్ష్యం నుంచి దూరమైపోతాడని హెచ్చరిస్తాయి పతంజలి యోగ సూత్రాలు.
అష్టసిద్ధులను పొందిన దేవతలు
[మార్చు]హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు, వినాయకుడు లకు అష్టసిద్ధులుండేవి. వీరిరువురికీ అష్టసిద్ధుల మీద పూర్తి సాధికారత ఉందనీ, వీరిన పూజించిన భక్తులకు ఆయా సిద్ధులను అతి సులభంగా అనుగ్రహించగలరనీ ఓ నమ్మకం. అందుకనే హనుమంతుని ‘అష్టసిద్ధి నవవిధికే దాతా’ అంటాడు తులసీదాసు తన హనుమాన్ చాలీసాలో. ఇక వినాయకుని భార్య సిద్ధి అన్నది కేవలం ఒక పేరు మాత్రమే కాదు. ఆమె అష్టసిద్ధులకు ప్రతిరూపం అన్నది ఓ విశ్లేషణ.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ HariOme (2015-12-19). "అష్టసిద్ధులు అంటే ఏమిటి ? | What ara Ashta Siddulu in Telugu ? • Hari Ome". Hari Ome (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2016-11-07. Retrieved 2020-04-30.
- ↑ Sindhu (2016-05-16). "అష్టసిద్ధులు అంటే ఏమి? అష్టసిద్దులు పొందివారి శక్తిసామర్థ్యాలు ఎలా ఉంటుంది..." boldsky. Archived from the original on 2016-07-22. Retrieved 2020-04-30.