ఆవడలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆవడలు

పెరుగులో నానబెట్టిన గారెలను ఆవడలు, పెరుగావడలు అంటారు.

రకాలు

[మార్చు]

తయారీ విధానం

[మార్చు]

ఆవడల కొరకు మామూలుగా చేసే గారెలమాదిరిగా కాక మినప్పప్పు లో కేరట్ తురుము, పూదీనా, అల్లం,కొత్తిమీర లాంటివి కలిపి గారెలు చేస్తారు. వాటిని నూనె ఆరేవరకూ కాగితంలో ఉంచి, పెరుగులో వేస్తారు. వీటికి వాడుపెరుగులో కూడా తాలింపుతోపాటు కేరట్ తురుము. కర్వేపాకు, కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు జతచేస్తారు

విధానం

[మార్చు]

మినప్పప్పు శుభ్రం చేసి, కడిగి 5 కప్పుల నీటిలో కనీసం రెండు గంటలు నానబెట్టాలి. తరువాత పప్పును గ్రైండ్ చేసుకోవాలి. రుబ్బేటప్పుడు నీళ్లు పోయకూడదు. నీళ్లనుండి తీసి రుబ్బితే చాలు. పిండిని మరీ మెత్తగా, కాటుకలా కాకుండా కాస్త బరకగా రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడే పచ్చిమిరపకాయ, అల్లం సన్నగా తరిగి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి పిండని చిన్న ఉండలుగా, ఒక గిన్నెలో లీటరు నీళ్లు పోసి ఈ కాలిన వడలు వేసి నాననివ్వాలి. దీనివలన వడలు మెత్తబడతాయి. పెరుగులో తగిన ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. అందులో నెయ్యితో పోపు పెట్టుకోవాలి. కరివేపాకు , కొత్తిమిర కలపాలి. నీళ్లలో వేసిన వడలు తీసి మెల్లిగా నీరు పిండి ఒక వెడల్పాటి గిన్నెలో సర్దిపెట్టాలి. దీనిపై పోపు పెట్టిన పెరుగు పోయాలి. దానిపై కారంపొడి,మిరియాలు పొడి వేసి, కొత్తిమిరతో కలిపి వడ్డించొచ్చు.

ఇతర విశేషాలు

[మార్చు]
  • పెరుగు ఆవడలను పెరుగు వడలు, పెరుగ్గారెలు అనీ పిలుస్తారు
  • వడలు ముందుగా నీళ్లలో వేయడం వల్ల అవి మెత్తగా అవుతాయి. పెరుగు మొత్తం పీల్చుకోవు. లేదంటే ముందు మజ్జిగలో కూడా నానబెట్టొచ్చు.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆవడలు&oldid=2983548" నుండి వెలికితీశారు