కుశుడు
కుశుడు | |
---|---|
దేవనాగరి | कुष |
తల్లిదండ్రులు | శ్రీరాముడు, సీత |
తోబుట్టువులు | లవుడు |
పాఠ్యగ్రంథాలు | రామాయణం |
రాజవంశం | రఘువంశం - ఇక్ష్వాకు వంశం - సూర్యవంశం |
కుశుడు (సంస్కృతం: कुष) [1] శ్రీరాముడు, సీత లకు కలిగిన కవల పిల్లలలో రెండవ వాడు. అతని సోదరుడు లవుడు. అతని గూర్చి హిందూ ఇతిహాసం రామాయణము, ఇతర గ్రంథాలలో కూడా వివరించబడింది. అతను తన తండ్రి వలె నలుపు రంగు కలిగి ఉంటే, అతని సోదరుడు లవుడు తన తల్లివలె గోధుమ రంగును కలిగి ఉంటాడు.
కుశుడు సీతారాములకు జన్మించిన కవలలో ఒకరు.
జననం, బాల్యం
[మార్చు]రామాయణం ప్రకారం, రామ రాజ్యంలో జరిగిన అపవాదు కారణంగా సీతను అయోధ్య రాజ్యం నుండి రాముడు బహిష్కరిస్తారు. తామ్సా నది ఒడ్డున ఉన్న వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆమె ఆశ్రయం పొందుతుంది.[2] ఆ ఆశ్రమంలో లవుడు, కుశుడు జన్మిస్తారు. వారికి వాల్మీకి మహర్షి విలువిద్య, సైనిక నైపుణ్యాలపై శిక్షణనిచ్చాడు. వారికి రామకథను కూడా నేర్చాడు.
అతని సోదరుడు లవుడు పేరుతో[3] "లవపురి"[4] నగరాన్ని స్థాపించినట్లు భావిస్తుంటారు. అది ప్రస్తుతం లాహోర్ నగరం.[5] భర్గుజర్, సకార్వర్, రాజపుత్రులు, లోహానా, కుర్మి, లెవ పతిదార్ వంటి ప్రస్తుత కులాలు లవుని సంతతిగా చెప్పుకొంటుంటారు. లవుడు ప్రాచీన భారతదేశంలోని క్షత్రియులకు చెందిన ఇక్ష్వాకుల వంశం లేదా సూర్యవంశ రాజ్యమునకు చెందినవాడు.[1][6][7]
అశ్వమేథ యాగం
[మార్చు]రాముడు నిర్వంచిన అశ్వమేథ యాగంలో వాల్మీకి లవ,కుశులతో సహా మారువేషంలో హాజరవుతాడు. లవుడు, కుశుడు రాజ్యంలో అనేక సమావేశాలలో ప్రేక్షకుల సమక్షంలో రామాయణ గాథను గానం చేస్తారు. సీత బహిష్కరణ గురించి లవుడు, కుశుడు పాడినపుడు రాముడు దు:ఖంతో బాధపడతాడు. రాముడు అడవికి వచ్చినపుడు వాల్మీకి ద్వారా సీతను గూర్చి తెలుసుకుంటాడు. సీతారాములు కలిసే సమయంలో సీత తన తల్లి భూమాతను పిలిచి తనను స్వీకరించమని అడుగుతుంది. తరువాత తల్లితో పాటు సీత అదృశ్యమవుతుంది. రాముడు లవుడు, కుశుడు తన పిల్లలని తెలుసుకుంటాడు.
కొన్ని గ్రంథాలలో లవుడు, కుశుడు అశ్వమేధయాగంలో ఉపయోగించిన యాగాశ్వాన్ని పట్టుకొని రాముడి సోదరులు, వారి సైన్యాన్ని ఓడిస్తాడని, రాముడు వారితో పోరాడటానికి వచ్చినప్పుడు, సీత జోక్యం చేసుకుని తండ్రి కొడుకులను ఏకం చేస్తుందని ఉంది.
తరువాత చరిత్ర
[మార్చు]రాముని అనంతరం లవుడు, కుశుడు రాజ్యాన్ని పరిపాలిస్తారు. వారు లవపురి (ప్రస్తుతం "లాహోర్"), కసూర్ నగరాలను స్థాపిస్తారు. రఘురాముడు అతని కుమారులైన లవుడిని శ్రావస్తి, కుశావతి.[8] రాజ్యాలకు రాజులుగా చేస్తాడు.
లవుడి ఆలయం లాహోర్ లోని షాహి ఖితా లోపల ఉంది. [9]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Lohana Community United Kingdom". Archived from the original on 4 October 2013. Retrieved 14 November 2010.
- ↑ Vishvanath Limaye (1984). Historic Rama of Valmiki. Gyan Ganga Prakashan.
- ↑ Masudul Hasan (1978). Guide to Lahore. Ferozsons.
- ↑ Bombay Historical Society (1946). Annual bibliography of Indian history and Indology, Volume 4. p. 257.
- ↑ Baqir, Muhammad (1985). Lahore, past and present. B.R. Pub. Corp. pp. 19–20.
- ↑ Diwan Bherumal Mahirchand Advani. Trans. by Narain Sobhraj Kimatrai. The Source of Sindhi Surnames. Chapter 6. Archived 2020-01-27 at the Wayback Machine 1947.
- ↑ "Leva Gurjars ancestry". Archived from the original on 2017-08-03. Retrieved 2020-04-16.
- ↑ Nadiem, Ihsan N (2005). Punjab: land, history, people. Al-Faisal Nashran. p. 111.
- ↑ Ahmed, Shoaib. "Lahore Fort dungeons to re-open after more than a century." Daily Times. 3 November 2004.