డానీ హ్యూస్టన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డానీ హ్యూస్టన్
2016లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో డానీ హ్యూస్టన్
జననం
డేనియల్ సల్లిస్ హ్యూస్టన్

(1962-05-14) 1962 మే 14 (వయసు 62)
పౌరసత్వం
  • యుఎస్
  • యుకె
విద్యాసంస్థలండన్ ఫిల్మ్ స్కూల్
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1975–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
వర్జీనియా మాడ్సెన్‌
(m. 1989; div. 1992)

కేటీ జేన్ ఎవాన్స్‌
(m. 2001; d. 2008)
పిల్లలు1
తల్లిదండ్రులు
బంధువులు

డేనియల్ సల్లిస్ హ్యూస్టన్ (జననం మే 14, 1962) అమెరికన్ నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. సినీ దర్శకుడు జాన్ హ్యూస్టన్ కుమారుడు, నటి అంజెలికా హ్యూస్టన్ సవతి సోదరుడు.

జననం, కుటుబం

[మార్చు]

డానీ హ్యూస్టన్ 1962, మే 14న దర్శకుడు, నటుడు జాన్ హ్యూస్టన్ - బ్రిటిష్ నటి జో సల్లిస్ దంపతులకు ఇటలీలోని రోమ్‌లో జన్మించాడు.[1] ఆ సమయంలో హ్యూస్టన్ ఇటలీలో ది బైబిల్: ఇన్ ది బిగినింగ్... అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు, ఆ సినిమాలో సల్లిస్ హాగర్ పాత్రను పోషించింది. తండ్రి ద్వారా, నటి అంజెలికా హ్యూస్టన్, స్క్రీన్ ప్లే రచయిత టోనీ హ్యూస్టన్‌లకు సవతి సోదరుడు. ఇతనికి పాబ్లో హ్యూస్టన్, రచయిత అల్లెగ్రా హ్యూస్టన్ అనే ఇద్దరు పెంపుడు తోబుట్టువులు ఉన్నారు. ఇతను అకాడమీ అవార్డు గెలుచుకున్న నటుడు వాల్టర్ హ్యూస్టన్ మనవడు. ఇతను కెనడియన్, వెల్ష్, స్కాట్స్-ఐరిష్, స్కాటిష్, ఆంగ్లో-ఇండియన్ సంతతికి చెందినవాడు.[2][3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1989లో నటి వర్జీనియా మాడ్సెన్‌తో డానీ హ్యూస్టన్ వివాహం జరిగింది. వారు 1992లో విడాకులు తీసుకున్నారు. 2001లో, కేటీ జేన్ ఎవాన్స్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి స్టెల్లా అనే బిడ్డ ఉంది.[4] డానీ హ్యూస్టన్, ఎవాన్స్ 2006లో విడిపోయారు. విడాకులు ఖరారు కాకముందే ఎవాన్స్ 2008, అక్టోబరులో ఆత్మహత్య చేసుకుంది.

సినిమారంగం

[మార్చు]

2000లో ఇవాన్స్ ఎక్.టి.సి (ఉత్తమ నటుడిగా ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డుకు నామినేట్),[5] 21 గ్రామ్స్ (2003), బర్త్ (2004), ది ఏవియేటర్ (2004),[6] ది ప్రపోజిషన్ (2005), ది కాన్స్టాంట్ గార్డనర్ (2005), మేరీ ఆంటోయినెట్ (2006),[7] చిల్డ్రన్ ఆఫ్ మెన్ (2006), ది కింగ్‌డమ్ (2007),[8] 30 డేస్ ఆఫ్ నైట్ (2007), రాబిన్ హుడ్ (2010),[9] హిచ్‌కాక్ (2012),[10] ది కాంగ్రెస్ (2013),[11] బిగ్ ఐస్ (2014),[12] డిసి ఎక్స్‌టెండెడ్ యూనివర్స్ సూపర్ హీరో సినిమా వండర్ వుమన్ (2017)[13][14] వంటి సినిమాలలో నటించి గుర్తింపు పొందాడు.

అమెరికన్ హర్రర్ స్టోరీ: కోవెన్, మాస్సిమో డోల్సెఫినో అనే ఎఫ్.ఎక్స్. సిరీస్‌లో ది ఆక్సెమాన్ పాత్రను అమెరికన్ హర్రర్ స్టోరీ: ఫ్రీక్ షోలో చిత్రీకరించారు.[15][16] మ్యాజిక్ సిటీలో బెన్ "ది బుట్చర్" డైమండ్ (2012–13), పారామౌంట్ నెట్‌వర్క్ డ్రామా సిరీస్ ఎల్లోస్టోన్ (2018–19) మొదటి రెండు సీజన్‌లలో డాన్ జెంకిన్స్, సక్సీషన్ (2019) రెండవ సీజన్‌లో జామీ లైర్డ్‌గా నటించాడు. మిస్టర్ నార్త్ (1988), ది మాడెనింగ్ (1995), ది లాస్ట్ ఫోటోగ్రాఫ్ (2017) సినిమాలకు దర్శకత్వం వహించాడు.

నటించినవి

[మార్చు]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
1996 ది ఐస్ ప్రిన్సెస్ దర్శకుడు మాత్రమే; టెలివిజన్ చిత్రం
2004 సిఎస్ఐ: క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ టై కాల్ఫీల్డ్ ఎపిసోడ్: "సక్కర్స్"
2006 కవర్ వన్: ది హేడిస్ ఫ్యాక్టర్ ఫ్రాంక్ క్లైన్ పునరావృత పాత్ర
2008 జాన్ ఆడమ్స్ శామ్యూల్ ఆడమ్స్ పునరావృత పాత్ర
2010 యు డోంట్ నో జాక్ జాఫ్రీ ఫిగర్ టెలివిజన్ చిత్రం
2012–2013 మ్యాజిక్ సిటీ బెన్ "ది బుట్చర్" డైమండ్ పునరావృత పాత్ర
2013–2014 అమెరికన్ హర్రర్ స్టోరీ: కోవెన్ ది ఆక్సెమాన్ పునరావృత పాత్ర
2014 మాస్టర్స్ ఆఫ్ సెక్స్ డా. డగ్లస్ గ్రేట్‌హౌస్ పునరావృత పాత్ర
2014–2015 అమెరికన్ హర్రర్ స్టోరీ: ఫ్రీక్ షో మాసిమో డోల్సెఫినో అతిథి పాత్ర
2016 పారనోయిడ్ నిక్ వైంగ్రో పునరావృత పాత్ర
2018–2019 ఎల్లోస్టోన్ డాన్ జెంకిన్స్ ప్రధాన పాత్ర (సీజన్లు 1–2)
2019 సక్సీషన్ జామీ లైర్డ్ పునరావృత పాత్ర
2019 డాక్ మార్టిన్ రాబర్ట్ బ్రూక్ ఎపిసోడ్: "వైల్డ్ వెస్ట్ కంట్రీ"
2020 రెడ్ బర్డ్ లేన్ హగ్ ప్రసారం చేయని పైలట్
2021 కాల్స్ ఫ్రాంక్ వాయిస్, ఎపిసోడ్: "ది యూనివర్స్ డిడ్ ఇట్"

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
అవార్డు సంవత్సరం విభాగం సినిమా ఫలితం
క్లోట్రుడిస్ అవార్డులు 2007 ఉత్తమ సహాయ నటుడు ది ప్రపొజిషన్ నామినేట్
ఎడిన్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2017 ఉత్తమ చిత్రం ది లాస్ట్ ఫోటోగ్రాఫ్ నామినేట్
గోల్డెన్ గ్లోబ్ అవార్డులు 2013 ఉత్తమ సహాయ నటుడు - సిరీస్, మినిసిరీస్ లేదా టెలివిజన్ ఫిల్మ్ నామినేట్[17]
ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డులు 2003 ఉత్తమ నటుడు ఇవాన్స్ ఎక్స్ టిసి నామినేట్[18]
మోంటే-కార్లో టెలివిజన్ ఫెస్టివల్ 2008 మినిసిరీస్‌లో అత్యుత్తమ నటుడు జాన్ ఆడమ్స్ నామినేట్[19]
మాంట్రియల్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2011 ఉత్తమ నటుడు ప్లేఆఫ్ విజేత[20]
శాటిలైట్ అవార్డులు 2005 ఉత్తమ సహాయ నటుడు - చలన చిత్రం తి కాంస్టెంట్ గార్డెనర్ విజేత[21]
స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డులు 2005 చలనచిత్రంలో నటీనటుల అత్యుత్తమ ప్రదర్శన ది ఏవియేటర్ నామినేట్[22]
సాటర్న్ అవార్డులు 2014 టెలివిజన్‌లో ఉత్తమ అతిథి పాత్ర అమెరికన్ హర్రర్ స్టోరీ: కోవెన్ నామినేట్[23]
టొరంటో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు 2006 ఉత్తమ సహాయ నటుడు ది ప్రపొజిషన్ నామినేట్[24]

మూలాలు

[మార్చు]
  1. "Danny Huston". www.tcm.com (in ఇంగ్లీష్). Retrieved 2023-06-09.
  2. Carr, Jay (July 31, 1988). "HAVING NOAH FOR A FATHER TO HIS SON DANNY, JOHN HUSTON WAS INDEED LARGER THAN LIFE". Boston Globe. Archived from the original on 2012-11-02. Retrieved 2023-06-09. My mother's half Indian, half English
  3. Huston, John (1994). An Open Book. Da Capo Press. p. 9. ISBN 0-306-80573-1.
  4. "Danny Huston Married Details, Dating, Family, Net Worth, 2019". LIVERAMPUP (in ఇంగ్లీష్). 2019-09-08. Retrieved 2023-06-09.
  5. "2003 IFP Independent Spirit Award Nominations". IndieWire (in ఇంగ్లీష్). 2002-12-11. Retrieved 2023-06-09.
  6. "The 11th Annual Screen Actors Guild Awards | Screen Actors Guild Awards". www.sagawards.org (in ఇంగ్లీష్). Retrieved 2023-06-09.
  7. Ebert, Roger. "Marie Antoinette movie review (2006) | Roger Ebert". rogerebert.com (in ఇంగ్లీష్). Retrieved 2023-06-09.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. Scott, A. O. (2007-09-28). "F.B.I. Agents Solve the Terrorist Problem )". The New York Times. ISSN 0362-4331. Retrieved 2023-06-09.
  9. Lane, Anthony (May 17, 2010). "Straight Arrows". The New Yorker. Retrieved 2023-06-09.
  10. Dargis, Manohla (2012-11-22). "A Knife and a Shower: Sounds Hitchcockian". The New York Times. ISSN 0362-4331. Retrieved 2023-06-09.
  11. "Cannes: Ari Folman's 'The Congress' to Open Directors' Fortnight". The Hollywood Reporter (in ఇంగ్లీష్). 2013-04-19. Retrieved 2023-06-09.
  12. "Danny Huston Talks Big Eyes and American Horror Story: Freak Show". Collider. 2014-12-30. Retrieved 2023-06-09.
  13. "Danny Huston on Making Wonder Woman and Waltzing with Gal Gadot". Collider. 2017-06-06. Retrieved 2023-06-09.
  14. Swiderski, Adam (2020-04-13). "Why Wade Jennings From Angel Has Fallen Looks So Familiar". Looper.com. Retrieved 2023-06-09.
  15. "American Horror Story: How Accurate Is The Show's Depiction Of Various Serial Killers?". CINEMABLEND. 2020-01-23. Retrieved 2023-06-09.
  16. Schremph, Kelly. "Was The Axeman on 'AHS Freakshow'? Yep, And He's The One Who Gave Elsa Her Legs". Bustle.
  17. "Golden Globes, USA (2013)". IMDb. Retrieved 2023-06-09.
  18. "Independent Spirit Awards (2003)". IMDb. Retrieved 2023-06-09.
  19. "Monte-Carlo TV Festival (2008)". IMDb. Retrieved 2023-06-09.
  20. "Montreal World Film Festival (2011)". IMDb. Retrieved 2023-06-09.
  21. "Satellite Awards (2005)". IMDb. Retrieved 2023-06-09.
  22. "Screen Actors Guild Awards (2005)". IMDb. Retrieved 2023-06-09.
  23. "The Saturn Award Nominations Include GRAVITY and THE HOBBIT". Collider. February 26, 2014. Retrieved 2023-06-09.
  24. "Toronto Film Critics Association Awards (2006)". IMDb. Retrieved 2023-06-09.

బయటి లింకులు

[మార్చు]