నామదేవుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంత్ నామదేవ్
జననంసుమారు 1270 CE
మహారాష్ట్ర
నిర్యాణముసుమారు 1350 CE
వివాదాస్పదం
తత్వంవర్కారీ
సాహిత్య రచనలుఅభంగాలు

నామదేవుడు (సా.శ. 1270 – 1350) మహారాష్ట్రకు చెందిన వాగ్గేయకారుడు. వర్కారీ సాంప్రదాయంలో ప్రముఖుడు. ఇతను జీవితం పై అనేక అస్పష్టతలున్నాయి. అతను మరణించిన కొన్ని శతాబ్దాల తరువాత అనేక అద్భుత సంఘటనలతో కూడిన జీవిత కథలు చాలా వచ్చాయి. కానీ పండితులు ఇందులో సమాచారం ఒకదానితో ఒకటి పొందికలేకుండా ఉందని అభిప్రాయపడ్డారు.[1]

నామదేవుడు వైష్ణవ సాంప్రదాయంచే ప్రభావితం అయ్యాడు. అతను రాసిన అనేక గీతాలు భజన పాటలుగా ప్రాచుర్యం పొందాయి. అతను పాటల్లో ముఖ్యంగా ఏకేశ్వరోపాసన, సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ తత్వాలు కనిపిస్తాయి. మిగతా గురువులతో కలిసి అతను ప్రారంభించిన వార్కరీ సాంప్రదాయం ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ సాంప్రదాయం ప్రకారం దక్షిణ మహారాష్ట్రలో సంవత్సరానికి రెండు సార్లు భక్తులు సామూహికంగా పండరీపురానికి పాదయాత్ర చేస్తారు. [2][3]

జీవిత విశేషాలు

[మార్చు]
సిక్కుమతంలో భాగవతులైన రవిదాస్, కబీరు, పీపా లతో నామదేవ్ (కుడి నుంచి రెండవ వ్యక్తి)

నామదేవుడి జీవితం గురించి స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవు. [4] చాలామంది అతను 1270, 1350 మధ్య జీవించి ఉండవచ్చునని భావిస్తున్నారు. కానీ మహారాష్ట్రలోని సంత్ సంప్రదాయాన్ని క్షుణ్ణంగా పరిశోధన చేసిన ఎస్.బి కులకర్ణి, క్రిస్టియన్ నోవెడ్కీ నామదేవుడు 1207-1287 ల మధ్య జీవించినట్లుగా భావిస్తున్నారు. [5] ఇంకా కొంతమంది పండితులు 1425 ప్రాంతంలో జీవించి ఉండవచ్చుననీ, ఆర్. భరద్వాజ్ అనే పండితుడు 1309-1372 లో జీవించి ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు.[6]

నామదేవుడికి రాజాయ్ అనే ఆమెతో వివాహం అయింది. వారికి విఠ అనే కొడుకు ఉన్నాడు. వీరిద్దరూ, నామదేవుడి తల్లి గోనాయ్ అతను గురించి రాశారు. అతను సమకాలికులైన ఒక శిష్యుడు, ఒక గురువు, ఒక కుమ్మరి కూడా అతను గురించి ప్రస్తావించారు. అయితే అప్పటి పాలకులు మాత్రం వారి రికార్డులలో, శాసనాలలో ఇతను గురించి ప్రస్తావించలేదు. వార్కరీ సాంప్రదాయం కాని వాళ్ళ రచన, మహానుభవ సంప్రదాయానికి చెందిన 1278 లో రాయబడిన లీలా చరిత్ర అనే గ్రంథంలో అతను ప్రస్తావన ఉంది. ఇంకా 1310లో రాయబడిన స్మృతిస్థల అనే మహానుభవ సాంప్రదాయ గ్రంథం కూడా ఇతను గురించి ప్రస్తావించి ఉండవచ్చు. దీని తరువాత 1538లో రాయబడిన మరాఠీ చరిత్ర భకర్ అనే గ్రంథంలో మాత్రమే అతను గురించి ప్రస్తావన ఉంది. [7][a]

మూలాలు

[మార్చు]

వివరణ

  1. పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం పతనమైన తరువాత మరాఠా దేశంలో నామదేవుడు ప్రముఖ పాత్ర పోషించిన మరాఠీ భక్తి ఉద్యమం పునరుత్తేజం పొందింది.[8]

ఉదహరింపులు

  1. Winand Callewaert (2003), Pilgrims, Patrons, and Place: Localizing Sanctity in Asian Religions (Editors: Phyllis Granoff and Koichi Shinohara), University of British Columbia Press, ISBN 978-0774810395, page 205
  2. Iwao (1988), pp. 186
  3. Novetzke (2013), pp. 83–84
  4. McGregor (1984), pp. 40–42
  5. Novetzke (2013), pp. 45–46
  6. Novetzke (2013), p. 48
  7. Novetzke (2013), pp. 42–44, 46
  8. Iwao (1988), p. 185

పుస్తకాలు

  • Callewaert, Winand M. and Mukunda Lāṭh (1989), The Hindi Songs of Namdev, Peeters Publishers, ISBN 978-906831-107-5
  • Iwao, Shima (June–September 1988), "The Vithoba Faith of Maharashtra: The Vithoba Temple of Pandharpur and Its Mythological Structure" (PDF), Japanese Journal of Religious Studies, 15 (2–3), Nanzan Institute for Religion and Culture: 183–197, ISSN 0304-1042, archived from the original (PDF) on 2009-03-26, retrieved 2016-04-28
  • McGregor, Ronald Stuart (1984), A History of Indian Literature, Otto Harrassowitz Verlag, ISBN 978-3-44702-413-6
  • McGregor, Ronald Stuart (1992), Devotional Literature in South Asia, Cambridge University Press, ISBN 978-0-52141-311-4
  • Novetzke, Christian Lee (2006), "A Family Affair", in Beck, Guy (ed.), Alternative Krishnas: Regional and Vernacular Variations on a Hindu Deity, State University of New York Press, ISBN 978-0-79146-416-8
  • Novetzke, Christian Lee (2013), Religion and Public Memory: A Cultural History of Saint Namdev in India, Columbia University Press, ISBN 978-0-23151-256-5
  • Prill, Susan (2009), "Representing Sainthood in India: Sikh and Hindu Visions of Namdev", Material Religion, 5 (2): 156–179
  • Sadarangani, Neeti M. (2004), Bhakti Poetry in Medieval India: Its Inception, Cultural Encounter and Impact, Sarup & Sons, ISBN 978-8-17625-436-6