బేరియం క్రోమేట్
పేర్లు | |
---|---|
ఇతర పేర్లు
Barium chromate oxide,
Chromic acid, (BaCrO4), barium salt (1:1), barium tetraoxochromate(VI) | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [10294-40-3] |
పబ్ కెమ్ | 25136 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | CQ876000 |
SMILES | [Ba+2].[O-][Cr]([O-])(=O)=O |
| |
ధర్మములు | |
BaCrO4 | |
మోలార్ ద్రవ్యరాశి | 253.37 g/mol |
స్వరూపం | yellow powder |
సాంద్రత | 4.498 g/cm3 |
ద్రవీభవన స్థానం | 210 °C (410 °F; 483 K) |
0.2775 mg/100 mL (20 °C) | |
ద్రావణీయత | soluble in strong acids |
ప్రమాదాలు | |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | మూస:R20/22 |
S-పదబంధాలు | (S2), S28 |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
బేరియం క్రోమేట్ ఒక బేరియం సమ్మేళనం. ఇది ఒక అకర్బన రసాయనిక సమ్మేళనం.
భౌతిక లక్షణాలు
[మార్చు]ఈ సమ్మేళనం యొక్క IUPAC నామం బేరియం టెట్రా అక్సో క్రోమేట్ (IV).ఈ సమ్మేళనం పసుపు వర్ణంలో ఉంది, ఇసుక వలె పొడిగా ఉండును.ఈ సమ్మేళనం యొక్క ఫార్ములా BaCrO4.బేరియం క్రోమేట్ ఆక్సీకరణ కారకంగా పనిచేయును.బేరియం క్రోమేట్ ను వేడి చేసిన, బేరియం ఆయనుల విడుదల కారణంగా ఆకుపచ్చ రంగు జ్వాలను వెలువరించును .
బేరియం క్రోమేట్ యొక్క మొలారు (అణు ) భారం 253.37గ్రాములు/మోల్.సాంద్రత 4.498 గ్రాములు/ సెం.మీ3.ద్రవీభవన స్థానం 210 °C (410 °F; 483K).ఈ సమ్మేళనం నీటిలో అంతగా కరగదు.20 °C వద్ద 100 మి.లీ నీటిలో 0.2775 మి.గ్రాముల బేరియం క్రోమేట్ కరుగుతుంది. కాని బలమైన ఆమ్లాలలో బేరియం క్రోమేట్ కరగుతుంది.
చరిత్ర
[మార్చు]సహజసిద్ధంగా ఏర్పడిన బేరియం క్రోమేట్ మొదట జోర్డాన్ దేశంలో గుర్తించారు. శిలలపై ఏర్పడిన బ్రౌన్ రంగు ఈ స్పటిక రూపంలో ఉన్న ఈ పదార్థానికి హేస్‌మైట్ అని జోర్డాన్ సామ్ర్యాజ్యం పేరును నిర్ధారించారు. ఈ హేస్‌మైట్ స్పటీకాలు పసుపు-బ్రౌన్ రంగు మొదలుకొని ఆకుపచ్చిని-బ్రౌన్ రంగు కలిగి, ఒకమిల్లి మీటరు పొడవు ఉండును.
ఈ హేస్‌మైట్ స్పటికాలు కేవలం బేరియం క్రోమేట్ ను మాత్రమే కాకుండగా, కొద్ది పరిమాణంలో సల్ఫర్ మూలకాన్ని కుడా కలిగి ఉండును.హెస్‌మైట్ లో సల్ఫర్ మలినంగా ఉన్న నిష్పత్తిని బట్టి స్పటికాలరంగు ముదురు వర్ణం నుండి లేత వర్ణం సంతరించుకుని ఉండును.
రసాయనిక చర్యలు
[మార్చు]పొటాషియం క్రోమేట్ ను బేరియం హైడ్రోక్సైడ్ లేదా బేరియం సల్ఫేట్ (barium sulphate) తో రసాయనిక చర్యకు లోను కావించడం వలన ఉత్పత్తి చెయ్య వచ్చును.
ప్రత్యన్యామయంగా బేరియం క్లోరైడ్, సోడియం క్రోమేట్ మధ్య అంతర చర్యవలనను ఉత్పత్తి చెయ్యవచ్చును. ఈ చర్యలో అవక్షేపంగా ఏర్పడిన బేరియం క్రోమేట్ ను నీటితో శుభ్రంగా కడిగి/శుద్ధి చేసి, వడబోసి తరువాత ఆరబెట్టి, నిల్వ చెయ్యుదురు. ఇది నీటిలో కరుగదు.కాని ఆమ్లంలలో కరుగుతుంది.
- 2 BaCrO4 + 2 H+ → 2 Ba2+ + Cr2O72− + H2O
Ksp = [Ba2+][CrO42−] = 2.1 x 10−10 సోడియం అజైడ్ సమక్షములో బేరియం క్రోమేట్ సమ్మేళనం బేరియం హైడ్రోక్సైడ్ తో చర్య జరపడం వలన బేరియం క్రోమేట్ (V) ఏర్పడును.
సాధారణ ఉపయోగాలు
[మార్చు]బేరియం క్రోమేట్‌ను పలు రకాలుగా ఉపయోగిస్తారు.తరచుగా క్రోమియం అయాను వాహకం (carrier) గా ఉపయోగిస్తారు.క్రోమియం ఎలక్ట్రో^ప్లేటింగులో బాత్ లోని సల్ఫెటును తొలగించుటకై స్కావెంజరుగా ఉపయోగిస్తారు.బేరియం క్రోమేట్ ఒక ఆక్సీకరణ కారకం బాణసంచు (టపాసులు తదితరాలు) యొక్క మండే వేగాన్ని మోడిఫై చేస్తుంది.బేరియం క్రోమేట్ ను రంగుల (paints ) తయారిలో కూడా ఉపయోగిస్తారు.రంగులలో లెడ్ సల్ఫేట్ తో కలిపినా బేరియం క్రోమేట్ రంగులకుకు నిమ్మపసుపు వర్ణాన్ని కల్గిస్తుంది.
భద్రత/ఆరోగ్యం పై ప్రభావం
[మార్చు]బేరియం క్రోమేట్ విషకారక పదార్థం .బేరియం క్లోరేట్ ను పుడిగా మార్చునప్పుడు ఏర్పడిన ధూళిని పిలచిన కాన్సరు వచ్చే అవకాశముంది