మన్నార్గుడి ఈశ్వరన్
మన్నార్గుడి అప్పయ్య ఈశ్వరన్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | మన్నార్గుడి, తమిళనాడు, భారతదేశం | 1947 ఏప్రిల్ 1
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వాయిద్యాలు | మృదంగం |
మన్నార్గుడి ఈశ్వరన్ (తమిళం: மன்னார்குடி ஈஸ்வரன்) వర్తమాన కర్ణాటక సంగీత మృదంగ విద్వాంసుడు.
విశేషాలు
[మార్చు]ఇతడు తమిళనాడు రాష్ట్రంలోని మన్నార్‌గుడి అనే పుణ్యక్షేత్రంలో 1947, ఏప్రిల్ 1వ తేదీన జన్మించాడు. ఇతడు కున్నిసేరి యు.కృష్ణమణి అయ్యర్ వద్ద మృదంగం నేర్చుకున్నాడు. ఇతడు పిన్నవయసులోనే సంగీత సభలలో, సంగీతోత్సవాలలో, వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఏ టాప్ గ్రేడు కళాకారుడిగా ఎంపికయ్యాడు. ఆకాశవాణి నిలయ విద్వాంసుడిగా ఇతడు అనేక సంగీత సమ్మేళనాలలో ఎందరో సంగీత కళాకారులకు మృదంగ వాద్య సహకారం అందించాడు. ఇతడు సోలో ప్రదర్శనలు కూడా అనేకం ఇచ్చాడు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ ఇతడిని విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఆహ్వానించింది. ఇతడు దేశవిదేశాలలో మృదంగవాద్యం గురించి అనేక ప్రసంగాలు చేశాడు[1].
పురస్కారాలు
[మార్చు]తమిళనాడులోని పలు సంస్థలు ఇతడిని సత్కరించాయి. "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" ఇతడికి 2003లో కళైమామణి పురస్కారంతో గౌరవించింది. 1992లో కంచి కామకోటి పీఠం ఇతడిని ఆస్థాన విద్వాంసునిగా నియమించింది. 2008లో ఇతనికి సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. కార్తీక్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఇతనికి జీవితసాఫల్య పురస్కారాన్ని అందజేసింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ web master. "Mannargudi A. Easwaran". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 18 సెప్టెంబరు 2020. Retrieved 16 March 2021.
- ↑ Krishnan, Lalithaa (2018-08-09). "Mannargudi Easwaran — master accompanist". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-12-29.
బయటి లింకులు
[మార్చు]- CS1 Indian English-language sources (en-in)
- Articles containing Tamil-language text
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1947 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- మృదంగ వాద్య కళాకారులు
- కళైమామణి పురస్కార గ్రహీతలు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు