సింహేంద్రమధ్యమ రాగం
Jump to navigation
Jump to search
సింహేంద్రమధ్యమ రాగం కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 57వ మేళకర్త రాగము.[1][2] దీనిని కర్ణాటక సంగీతం ముత్తుస్వామి దీక్షితార్ పాఠశాలలో సుమద్యుతి అని అంటారు. ఇది కర్ణాటక సంగీతం నుండి హిందూస్థానీ సంగీతంలోకి అరువు తెచ్చుకున్నట్లు చెబుతారు.[3]
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ: స రి గ మ ప ధ ని స
- (S R2 G2 M2 P D1 N3 S)
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
- (S N3 D1 P M2 G2 R2 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 21వ మేళకర్త రాగమైన కీరవాణి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు
[మార్చు]- నీదు చరణములే - త్యాగయ్య
- నిన్నే నమ్మితినయ్యా - మైసూరు వసుదేవాచారి
- పన్నగేంద్రశయనా - త్యాగయ్య
- కమలాక్షి కామకోటి పీఠ వాసిని - ముత్తుస్వామి దీక్షితులు
- పామరజనపాలిని - ముత్తుస్వామి దీక్షితులు
- అయ్యప్పా - జేసుదాస్
- రామ రామ గుణసీమ - స్వాతి తిరునాళ్
- మరకత సింహాసన - మంగళంపల్లి బాలమురళీ కృష్ణ
- ఇహ పరం యెన్నుమ్ - మహా వైద్యనాథ అయ్యర్
తెలుగు సినిమా పాటలు
[మార్చు]1 | ఈ నిరాధరణ భరించా | శ్రీ వెంకటేశ్వర మహత్యం |
2 | నా తల గొట్టి | పల్నాటి యుద్ధం (1947 సినిమా) |