1715
Jump to navigation
Jump to search
1715 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1712 1713 1714 - 1715 - 1716 1717 1718 |
దశాబ్దాలు: | 1690లు 1700లు - 1710లు - 1720లు 1730లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మే 3: సంపూర్ణ సూర్యగ్రహణం దక్షిణ ఇంగ్లాండ్, స్వీడన్ (కిందటిసారి లండన్ లో సంపూర్ణ సూర్య గ్రహణం కనిపించినది దాదాపు 900 సంవత్సరాల క్రితం) ఫిన్లాండ్ లలో కనిపించింది.
- జూలై 24: 1715 ట్రెజర్ ఫ్లీట్ : జనరల్ డాన్ జువాన్ ఉబిల్లా ఆధ్వర్యంలో 12 నౌకలతో కూడిన స్పానిషు బిడారు, క్యూబాలోని హవానా నుండి స్పెయిన్ బయలుదేరింది. ఏడు రోజుల తరువాత, వాటిలో 11 ఫ్లోరిడా తీరంలో తుఫానులో మునిగిపోయాయి (కొన్ని శతాబ్దాల తరువాత, ఈ శిథిలాల నుండి నిధిని కనుగొన్నారు).
- ఆగష్టు 31: ఓల్డ్ డాక్, లివర్‌పూల్, ఇంగ్లాండ్. ప్రపంచంలో మొట్టమొదటి పరివేష్టిత వాణిజ్య తడి డాక్ ప్రారంభమైంది. [1] [2]
- సెప్టెంబర్ 1: ఫ్రాన్స్ రాజు లూయిస్ XIV 72 సంవత్సరాల పాలన తరువాత మరణించాడు. తన సింహాసనాన్ని తన మనవడు లూయిస్ XV అందుకున్నాడు. అతను 58 సంవత్సరాలు పరిపాలన చేసాడు.
- సెప్టెంబరు: ఫర్రూక్ సియార్ జోధ్‌పూర్ మహారాజా అజిత్ సింఘ్ కుమార్తె ఇందిరా కన్వర్ ను వివాహం చేసుకున్నాడు.
- అక్టోబరు: జాన్ మూర్ ఐర్లాండ్ యొక్క పీర్ అయ్యాడు .
- డిసెంబరు 24: స్వీడన్ దళాలు నార్వేను ఆక్రమించాయి.
- తేదీ తెలియదు: కూచిమంచి తిమ్మకవి రుక్మిణీ పరిణయము కావ్యం రచించాడు.
- తేదీ తెలియదు: ఫ్రెంచ్ కాలనీ సెయింట్-డొమింగ్యూలో మొదట కాఫీని పండించారు. [3]
- తేదీ తెలియదు: ఈ సంవత్సరంలో, స్పెయిన్‌కు చెందిన ఫిలిప్ V కోసం బ్రీచ్ లోడింగ్ తుపాకీని తయారు చేసారు.
జననాలు
[మార్చు]- ఏప్రిల్ 3: విలియం వాట్సన్, ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త. (మ.1787)
- అక్టోబరు 23: పీటర్ II, రష్యా చక్రవర్తి (మ. 1730)
మరణాలు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Trading Places: Old Dock History". Liverpool Museums.
- ↑ "Liverpool: The docks". British History Online. 1911. pp. 41–43. Archived from the original on 2011-05-25. Retrieved 2020-07-24.
- ↑ According to Coffee: A Dark History.