1952
స్వరూపం
1952 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1949 1950 1951 - 1952 - 1953 1954 1955 |
దశాబ్దాలు: | 1930లు 1940లు 1950లు 1960లు 1970లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మే 15: భారతదేశ మొట్టమొదటి లోక్సభ స్పీకర్గా గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ పదవిని స్వీకరించారు.
- జూలై 19: 15వ వేసవి ఒలింపిక్ క్రీడలు హెల్సింకిలో ప్రారంభమయ్యాయి.
- డిసెంబర్ 15: ప్రత్యేకాంధ్ర సాధనకై 56 రోజుల నిరాహార దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యారు.
జననాలు
[మార్చు]- జనవరి 1: గౌరీ శంకర్ బైసెన్, రాజకీయ నాయకుడు. లోక్సభ సభ్యుడు.
- జనవరి 25: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (మ.1999)
- జనవరి 27: ఆస్మా జహంగీర్, పాకిస్తాన్కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (మ.2018)
- ఫిబ్రవరి 14: సుష్మాస్వరాజ్, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు.
- ఫిబ్రవరి 15: రాధా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.
- మార్చి 1: పొన్ రాధాకృష్ణన్, తమిళనాడుకు చెందిన రాజకీయనాయకుడు. లోకసభ సభ్యుడు. కేంద్ర సహాయమంత్రి.
- మార్చి 7: వివియన్ రిచర్డ్స్వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్.
- మార్చి 19: మోహన్ బాబు, తెలుగు సినిమా నటుడు.
- మార్చి 29: కె.ఎన్.వై.పతంజలి, తెలుగు రచయిత. (మ.2009)
- ఏప్రిల్ 24: చిలుకూరి దేవపుత్ర, ఏకాకి నౌక చప్పుడు, వంకరటింకర ఓ, ఆరుగ్లాసులు రచయిత. (మ.2016))
- మే 29: అంబరీష్, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (మ.2018)
- జూన్ 1: సబ్బం హరి, రాజకీయనాయకుడు
- జూన్ 3: బండి నారాయణస్వామి అనంతపురం జిల్లాకు చెందిన కథారచయిత, నవలాకారుడు.
- ఆగష్టు 25: దులీప్ మెండిస్, శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- సెప్టెంబర్ 12: అల్లాబక్షి బేగ్ షేక్, రచయిత, నటుడు.
- అక్టోబర్ 5: మధురాంతకం రాజారాం, రచయిత. (మ.1930)
- నవంబరు 5: వందన శివ, ఒక తత్త్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, పర్యావరణ, స్త్రీవాద రచయిత్రి.
- నవంబర్ 24: బ్రిజేష్ పటేల్, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- నవంబర్ 25: ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు.
- డిసెంబర్ 10 : సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (మ.2011)
మరణాలు
[మార్చు]- మార్చి 7: పరమహంస యోగానంద, భారతదేశ గురువు. (జ.1893)
- మే 19: బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. (జ.1878)
- సెప్టెంబర్ 9: వేపా కృష్ణమూర్తి, తెలుగువాడైన ఇంజనీరు. (జ.1910)
- సెప్టెంబర్ 22: అడివి బాపిరాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. (జ.1895)
- నవంబర్ 21: బెల్లంకొండ సుబ్బారావు, రంగస్థల నటుడు, న్యాయవాది. (జ.1902)
- డిసెంబర్ 15: పొట్టి శ్రీరాములు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి. (జ.1901)
- డిసెంబర్ 18: గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (జ.1893)