గాయత్రి చక్రవర్తి స్పివాక్
జననం | Calcutta, British India | 1942 ఫిబ్రవరి 24
---|---|
యుగం | 20th-century philosophy |
తత్వ శాస్త్ర పాఠశాలలు | Post-colonial theory Post-structuralism |
ప్రధాన అభిరుచులు | History of ideas · Literature · Deconstruction · Feminism · Marxism |
ప్రసిద్ధ ప్రసిద్ధ ఆలోచనలు | "subaltern", "strategic essentialism", "epistemological performance" |
ప్రభావితులు |
గాయత్రి చక్రవర్తి స్పివాక్ (జననం ఫిబ్రవరి 24 1942) సాహిత్య సిద్ధాంత కర్త, తత్వవేత్త, కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా యున్నారు. ఆమె సమకాలీన సాహిత్యం, సమాజం కోసం పాఠశాల యొక్క సంస్థకు వ్యవస్థాపక సభ్యురాలు.[1] ఆమె వ్రాసిన పాఠ్యం "కెన్ ద సబాల్టన్ స్పీక్?" అనేది వలసోత్తర వాదం యొక్క వ్యవస్థాపక పాఠంగా వ్యవహరిస్తారు. ఆమె "జాక్వీస్ డెర్రిడా" యొక్క "డె లా గ్రమ్మటోలోగీ" యొక్క పరిచయ భాగం యొక్క అనువాదం ముఖ్యమైనదిగా భావిస్తారు. 2012 లో "క్యోటొ ప్రైజ్ ఇన్ ఆర్ట్స్ అండ్ ఫిలాసపీ" అనే అవార్డు "ప్రపంచీకరణ ప్రపంచంలో సంబంధించి మేధో వలసవాదం వ్యతిరేకంగా మానవీయ మాట్లాడే ఒక సూక్ష్మ సిద్ధాంతకర్తగా, విద్యావేత్తగా" ఆమెకు వచ్చింది.[2] అంతర్జాతీయ గుర్తింపు పొందిన గాయత్రి చక్రవర్తిని.,కంప్యూటర్ గ్రాఫిక్స్ పితామహుడు ఇవాన్ సుథర్ లాండ్, మోలిక్యులర్ సెల్ బయాలజిస్ట్ యోషినోరి ఓషుమతో కలిపి అవార్డుకు ఎంపిక చేసినట్లు జపాన్కు చెందిన ఇనమోరి ఫౌండేషన్ ప్రకటించింది. ఆమెకు భారత విశిష్ట పురస్కారమైన "పద్మభూషణ" పురస్కారం 2013 లో వచ్చింది.[3]
జీవిత విశేషాలు
[మార్చు]గాయత్రీ చక్రవర్తి స్పివాక్ యొక్క తల్లిదండ్రులు శివానీ చక్రవర్తి, పారెస్ చంద్ర లు. ఆమె భారతదేశములో కలకత్తా నగరంలో 1942 ఫిబ్రవరి 24 న జన్మించారు.[4] సెయింట్ జాన్ డియోసెసన్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ పాఠశాల యందు విద్యను పూర్తి చేసిన తరువాత 1959 లో కలకత్తా విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రెసిడెన్సీ కళాశాల యందు ఆంగ్లం పై డిగ్రీని పొందారు.ఆమెకు గ్రాడ్యుయేషన్ లో ఆంగ్ల, బెంగాలీ సాహిత్యంలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులై బంగారు పతకాలను గెలుచుకుంది.[4] ఆ తరువాత ఆమె కార్నెల్ విశ్వవిద్యాలయంలో హజరై ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ, "కంపేరటివ్ లిటరేచర్"లో పి.హెచ్.డిని కూడా పొందింది.[4]
ఆమె విలియం బట్లర్ యీట్స్ వ్యాసాలపై అధ్యయనం చేసింది.[4] ఆమె "టెల్లూరైడ్ అసోసియేషన్"లో ఎన్నికైన రెండవ మహిళ. ఆమె 1960 లో "టాల్‌బోట్ స్పివాక్"ను వివాహమాడింది. "టాల్‌బోట్ స్పివాక్" వ్రాసిన స్వీయ చరిత్రా నవల "ది బ్రైడ్ వోర్ ది ట్రడిషనల్ గోల్డ్"లో వారి వివాహ విషయాలను ప్రస్తావించారు.[5]
మార్చి 2007 లో స్పివాక్ కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆమె విశ్వవిద్యాలయ 264 సంవత్సరాల చరిత్రలో ఉత్తతమైన గౌరవాన్ని పొందిన ఏకైక మహిళగా చరిత్రకెక్కారు.[6]
జూన్ 2012 లొ ఆమె "క్యోటో ప్రైజ్ ఇన్ ఆర్ట్స్ అండ్ ఫిలాసపీ" అవార్డును పొందారు.[7]
అంతర్జాతీయంగా విద్యా విధానంలో వస్తున్న మార్పులు, స్త్రీవాద భావనల్ని సమర్థించడంలో గాయత్రీ చేసిన కృషిని సహచరులు గుర్తు చేసుకుంటుంటారు. ఆర్థిక అసమానతల నేపథ్యంలో కింది స్థాయి ఉద్యోగుల కష్టాలపై 1985లో గాయత్రి రచించిన కెన్ ది సబ్ అల్ టర్న్ స్పీక్ పుస్తకం సంచలనం సృష్టించింది. వలసపాలన విధానం దుష్పరిణామాలను ఎండగట్టడంలో గాయత్రి రచనల్ని ఇప్పటికి ప్రమాణికంగా తీసుకుంటుంటారు. 51ఏళ్ళ పాటు అమెరికాలో జీవించిన గాయత్రి చక్రవర్తి ఇప్పటికి భారత పౌరసత్వాన్ని వదులుకోలేదు.
పాస్ పోర్టు మార్చుకోవాలనే ఆలోచన తనకెప్పుడు రాలేదంటారు. సౌకర్యాల కోసమే బ్రతకనక్కర్లేదని, ఇబ్బందులున్నా ప్రపంచమొత్తం పర్యటించడానికి తనకెప్పుడు పాస్ పోర్ట్ అడ్డంకి కాలేదన్నారు. తనను న్యూయార్క్ వాసిగా చెప్పుకుంటానే తప్ప అమెరికన్ అని చెప్పుకోనంటారు.
పుస్తకాలు
[మార్చు]విద్యాసంబంధమైనవి
[మార్చు]- Myself, I Must Remake: The Life and Poetry of W.B. Yeats (1974).
- Of Grammatology (translation, with a critical introduction, of Derrida's text) (1976)
- In Other Worlds: Essays in Cultural Politics (1987).
- Selected Subaltern Studies (edited with Ranajit Guha) (1988)
- The Post-Colonial Critic - Interviews, Strategies, Dialogues (1990)
- Outside in the Teaching Machine (1993).
- The Spivak Reader (1995).
- A Critique of Postcolonial Reason: Towards a History of the Vanishing Present (1999).
- Death of a Discipline (2003).
- Other Asias (2005).
- An Aesthetic Education in the Era of Globalization (2012).
సహిత్య పరమైనవి
[మార్చు]- Imaginary Maps (translation with critical introduction of three stories by Mahasweta Devi) (1994)
- Breast Stories (translation with critical introduction of three stories by Mahasweta Devi) (1997)
- Old Women (translation with critical introduction of two stories by Mahasweta Devi) (1999)
- Song for Kali: A Cycle (translation with introduction of story by Ramproshad Sen) (2000)
- Chotti Munda and His Arrow (translation with critical introduction of the novel by Mahasweta Devi) (2002)
- Red Thread (forthcoming)
ఇతర పఠనాలు
[మార్చు]- Stephen Morton, Gayatri Spivak: Ethics, Subalternity and the Critique of Postcolonial Reason (Polity, 2007).
- Gayatri Chakravorty Spivak, Donna Landry, and Gerald M. MacLean, The Spivak reader: Selected Works (Routledge, 1996).
- Suzana Milevska, "Resistance That Cannot be Recognised as Such: Interview with Gayatri Chakravorty Spivak," n.paradoxa: international feminist art journal, Jan. 2005, vol. 15, pp. 6–12.
మూలాలు
[మార్చు]- ↑ Columbia faculty profile
- ↑ "The 2012 Kyoto Prize Laureate". Inamori Foundation. Archived from the original on 20 జనవరి 2013. Retrieved 1 January 2013.
- ↑ "List of Padma awardees".
- ↑ 4.0 4.1 4.2 4.3 "Reading Spivak". The Spivak reader: selected works of Gayatri Chakravorty Spivak. Routledge. 1996. pp. 1–4.
- ↑ http://www.abebooks.com/bride-wore-traditional-gold-Talbot-Spivak/3212317138/bd
- ↑ LAHIRI, BULAN (2011-02-06). "Speaking to Spivak". The Hindu. Chennai, India. Archived from the original on 2011-02-09. Retrieved 7 February 2011.
- ↑ "Kyoto Prize". Retrieved 2012-06-22.
ఇతర లింకులు
[మార్చు]- "Righting Wrongs" (read full article)
- "'Woman' as Theatre" in Radical Philosophy
- Full article: "Can the Subaltern Speak?"
- "In the Gaudy Supermarket" Archived 2006-12-10 at the Wayback Machine – A critical review of A Critique of Post-Colonial Reason: Toward a History of the Vanishing Present by Terry Eagleton in the London Review of Books, May 1999
- "Exacting Solidarities" Archived 2009-10-08 at the Wayback Machine – Letters responding to Eagleton's review of Spivak by Judith Butler and others
- Glossary of Key Terms in the Work of Spivak
- MLA Journals: PMLA, Vol. 123, No. 1, January 2008
- MLA Journals: PMLA, Vol. 125, No. 4, October 2010
- "An Aesthetic Education in the Era of Globalization"; Gayatri Spivak describes her 2012 collection from Harvard University Press
- "Creating a Stir Wherever she goes" – The New York Times, February 2002
- http://sevalive.com/sahithya/?p=421[permanent dead link]
- Infobox philosopher maintenance
- All articles with dead external links
- AC with 14 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with ORCID identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- 1942 జననాలు
- భారతీయ స్త్రీవాదులు
- బెంగాలీ రచయితలు
- మార్క్సిస్టులు
- భారతీయ రచయిత్రులు
- అమెరికా రచయితలు
- జీవిస్తున్న ప్రజలు
- University of Iowa alumni
- భారతీయ మహిళా తత్వవేత్తలు
- భారతీయ విద్యావేత్తలు
- పద్మభూషణ పురస్కారం పొందిన మహిళలు
- భారతీయ తత్వవేత్తలు