నామకరణము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నామకరణము అనగా పుట్టిన బిడ్డకు పేరు (Name) పెట్టడం ఒక శుభకార్యం. దీనిని ఒక ఉత్సవంగా జరిపే సాంప్రదాయం వలన నామకరణోత్సరం అని కూడా అంటారు.

నామకరణ మహోత్సవం

[మార్చు]
కేరళలో తాత గారింటి వద్ద బిడ్డకు నామకరణం చేయుట.
  • నామకరణ మహోత్సవం సాధారణంగా దేవాలయాలలో జరుపుతుంటారు.
  • పళ్లెంలో బియ్యం పోసి వాటిపై బంగారు, వెండి వస్తువు దేనినైనా ఉపయోగిస్తూ, ధర్భగడ్డి చుట్టిన వేళ్ళతో మొదటి సారి పేరు రాస్తారు.
  • తండ్రి ఒడిలో కూర్చుండబెట్టుకొని బిడ్డతో మొదటగాపేరు రాయిస్తారు, తరువాత తల్లి మిగిలిన వారు రాయిస్తారు.
  • ఇది లగ్నాదుల శుద్ధి ననుసరించి చేయవలయుదురు. జాతాశౌచము పూర్తియైన తరువాత పండ్రెండ్రవ రోజునగాని, పదహారవ రోజున గాని, యిరువది యగు రోజునకాని, యిరువది రెండవ రోజున గాని నామకరణం చేయిస్తారు
  • పురుషులకు సరి సంఖ్య, స్త్రీలకు బేసి సంఖ్య గల యక్షరములతో నున్న నామములను నామకరణ మహోత్సవములో ఎక్కువగా వాడుతుంటరు

రాశుల, నక్షత్రాల ద్వారా నామకరణములు

[మార్చు]
కేరళలో నామకరణ ఉత్సవంలో భాగంగా బిడ్డ చెవిలో నాన్నమ్మ మూడుసార్లు పేరును నెమ్మదిగా చెబుతున్న దృశ్యం

ఒక్కొక్కరాశియందు తొమ్మిది నక్షత్రచరణముల ద్వారా ప్రతీ నక్షత్ర చరణమునకూ ఒక అక్షరము చెప్పబడింది. ఆ అక్షరము ఆధారముగ పుట్టినవానికి నామకరణము చేయుట అనాదిగ వస్తున్న సంప్రదాయము.దీని ద్వారా ఒక్కోరాశికి నలుగు పాదాలుగా చేసి ఆ కాలమును అనుసరించి పుట్టిన బిడ్డకు ఆయా నక్షత్రములలోని నాలుగు అక్షరములలో ఒకటి ముందు వచ్చునట్టుగా పేరు నిర్ణయము చేస్తారు.

రసాయనశాస్త్రంలో నామకరణం

[మార్చు]

రసాయనశాస్త్రంలో IUPAC ప్రకారం మూలకాలకు పేరు పెడతారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నామకరణము&oldid=4094919" నుండి వెలికితీశారు