మాక్స్ ప్లాంక్
This article includes a list of references, related reading or external links, but its sources remain unclear because it lacks inline citations. (2023 నవంబరు) |
మాక్స్ ప్లాంక్ | |
---|---|
జననం | కీల్, హోల్‌స్టీన్ | 1858 ఏప్రిల్ 23
మరణం | 1947 అక్టోబరు 4 గొట్టింజెన్, పశ్చిమ జర్మనీ | (వయసు 89)
జాతీయత | జర్మన్ |
రంగములు | భౌతిక శాస్త్రము |
వృత్తిసంస్థలు | University of Kiel University of Berlin University of Göttingen Kaiser-Wilhelm-Gesellschaft |
చదువుకున్న సంస్థలు | లుడ్విగ్ మాక్సిమిలియన్ యూనివర్శిటీ ఆఫ్ మ్యూనిక్ |
పరిశోధనా సలహాదారుడు(లు) | Alexander von Brill |
డాక్టొరల్ విద్యార్థులు | Gustav Ludwig Hertz Erich Kretschmann Walther Meißner Walter Schottky Max von Laue Max Abraham Moritz Schlick Walther Bothe Julius Edgar Lilienfeld |
ప్రసిద్ధి | ప్లాంక్ స్థిరాంకం ప్లాంక్ మూలసూత్రం ప్లాంక్ కృష్ణవస్తు వికిరణ నియమం (Planck's law of black body radiation) |
ముఖ్యమైన పురస్కారాలు | భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి (1918) |
సంతకం | |
గమనికలు He is the father of Erwin Planck who was executed in 1945 by the Gestapo for his part in the July 20 plot. |
మాక్స్ ప్లాంక్ (ఏప్రిల్ 23, 1858 – అక్టోబర్ 4, 1947) ప్రఖ్యాత జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. ఆయనను క్వాంటం భౌతిక శాస్త్రానికి ఆద్యుడిగా భావిస్తారు. 17 ఏళ్ళకే డిగ్రీ చేశాడు. 31 ఏళ్ళకే ప్రొఫెసర్ అయ్యాడు. క్వాంటమ్ వాదాన్ని ప్రతిపాదించినందుకు గాను 1918 లో నోబెల్ బహుమతి సాధించాడు.
బాల్యం
[మార్చు]జర్మనీ లోని కీల్ లో 1858 ఏప్రిల్ 23 న ఓ విద్యాధికుల కుటుంబంలో పుట్టిన మాక్స్ ప్లాంక్ చదువు, సంగీత రంగాల్లో చురుకైన వాడుగా పేరు తెచ్చుకున్నాడు. పదిహేడేళ్ళకే డిగ్రీ చేసి, భౌతిక శాస్త్రాన్ని అభ్యసించి ఒక ప్రయోగానికి గాను డాక్టరేట్ పొందాడు. ఆయన జీవితకాలంలో చేసిన ప్రయోగం అదొక్కటే. ఆపై ఆయన అందించిన విజ్ఞానం అంతా దాని ఆధారంగా చేసుకున్న సిద్ధాంత పరమైనదే.
బెర్లిన్ విశ్వవిద్యాలయంలో 31 ఏళ్ళకే భౌతిక శాస్త్ర విభాగానికి అధిపతి అయ్యాడు. 1900 లోప్రతిపాదించిన క్వాంటమ్వాదం పెద్ద సంచలనం. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఫోటో విద్యుత్ ఫలితం వాదం, ప్లాంక్ క్వాంటమ్ వాదాన్ని మరింతగా బలపరిచింది.
క్వాంటమ్ వాదం
[మార్చు]క్వాంటమ్ వాదం ఈ ప్రపంచాన్ని సరికొత్త కోణంలో చూపుతుంది. దీని ప్రకారం శక్తి అవిచ్ఛిన్నంగా కాకుండా విడివిడిగా అతి చిన్న పరిమాణాల్లో కణాల రూపంలో ఉంటుంది. ఒక పరిమాణాన్ని ఒక క్వాంటమ్ శక్తి అంటారు. ఇది ఆవర్తన పట్టికను విపులీకరిస్తుంది. రసాయనిక చర్యలు ఎందుకు జరుగుతాయో చెబుతుంది. జీవశాస్త్రంలో డీఎన్‌ఏ కణాల స్థిరత్వాన్ని, పరమాణు కేంద్రం నుంచి ఆల్ఫా కణాల వికిరణాలను వివరిస్తుంది.
ప్రస్తుతం ఎంతగానో ఉపయోగపడుతున్న లేజర్ కిరణాలు, కంప్యూటర్ రంగానికి మూలాధారమైన మైక్రోచిప్స్, అతివాహకత, కాంపాక్ట్ డిస్క్ ల ఆవిష్కరణకు నాంది పలికింది. దీని ఆధారంగా పరిశోధనలు చేసిన వారెందరో నోబెల్ బహుమతులు అందుకున్నారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆయన జీవితం విషాద భరితం. పెద్ద కుమారుడు ప్రపంచ యుద్ధంలో మరణించాడు. ఇద్దరు కుమార్తెలు వివాహమైన కొద్ది రోజులకే చనిపోయారు. చిన్న కుమారుడిని దేశద్రోహిగా చిత్రీకరించి హిట్లర్ ఉరి తీయించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు సాగిపోవడం ఆయన దృఢసంకల్పానికి నిదర్శనం.
గాత్ర, వాయిద్య సంగీతాల్లో మంచి పట్టున్న ఓ కుర్రాడు భౌతికశాస్త్ర అధ్యయనానికి రావాలనుకున్నప్పుడు, ఓ ప్రొఫెసర్ అన్నారు: 'ఇక ఇందులో కనిపెట్టాల్సిందంటూ ఏదీ లేదు. ఉన్నవాటిని కొనసాగించడం తప్ప'. అది విన్న ఆ కుర్రాడు, 'నేనేమీ కనిపెట్టాలనుకోవడం లేదు. ఇందులో ప్రాథమిక విషయాలు నేర్చుకుంటానంతే' అన్నాడు. కానీ ఆ కుర్రాడే భౌతిక శాస్త్రాన్ని మలుపు తిప్పే కొత్త సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. ఆధునిక భౌతిక శాస్త్రానికి ఆద్యుడిగా పేరొందాడు. అతడే మాక్స్ కారల్ ఎర్నెస్ట్ లుడ్విగ్ ప్లాంక్. అతడు లోకానికి అందించిన వరమే 'క్వాంటమ్ సిద్ధాంతం' (Quantum Theory).
గ్రంథములు
[మార్చు]- Aczel, Amir D. Entanglement, Chapter 4. (Penguin, 2003) ISBN 978-0-452-28457-9
- Heilbron, J. L. (2000). The dilemmas of an upright man: Max Planck and the fortunes of German science. Harvard University Press. ISBN 0-674-00439-6.
- Pickover, Clifford A. Archimedes to Hawking: Laws of Science and the Great Minds Behind Them, Oxford University Press, 2008, ISBN 978-0-19-533611-5
- Rosenthal-Schneider, Ilse Reality and Scientific Truth: Discussions with Einstein, von Laue, and Planck (Wayne State University, 1980) ISBN 0-8143-1650-6
యితర లింకులు
[మార్చు]జీవిత చరిత్రలు
[మార్చు]- Annotated bibliography for Max Planck from the Alsos Digital Library for Nuclear Issues
- Max Planck – Encyclopædia Britannica article
- Max Planck Biography – www.nobel-prize-winners.com
- Max Planck Institutes of Natural Science and Astrophysics
- Cinematic self portrait of Max Planck, Berlin-Brandenburgische Akademie der Wissenschaften, 1942
- Nobel Biography
వ్యాసాలు
[మార్చు]- Life–Work–Personality – Exhibition on the 50th anniversary of Planck's death
- Max Planck, Planck's constant, and Schrodinger's Cat
{{ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు}}
మూలాలు
[మార్చు]- Articles lacking in-text citations from 2023 నవంబరు
- All articles lacking in-text citations
- Commons link is on Wikidata
- AC with 16 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1858 జననాలు
- 1947 మరణాలు
- జర్మన్ శాస్త్రవేత్తలు
- భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతలు
- ISBN మ్యాజిక్ లింకులను వాడే పేజీలు